గమనిక:
1.దీర్ఘకాలిక లేదా తీవ్ర ఆరోగ్య సమస్యలు అనగా…కిడ్నీ, లివర్, క్యాన్సర్ మొదలగు సమస్యలు ఉన్న వారు డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే ఈ ఆహార నియమాలు పాటించాలి.
2.డయాబెటిక్ వాళ్ళు జ్యూస్ లో తేనె వాడరాదు.
- డైట్ ముఖ్య సూత్రాలు
- జ్యూసులు
- ఆహారం
1. సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి (సుమారుగా 5am). లేచిన వెంటనే రెండు గ్లాసుల మంచినీళ్లు తాగండి. ఒక గంట విడిచి మళ్లీ రెండు గ్లాసుల మంచినీళ్లు తాగండి. 5-8am లోపు కాలకృత్యాలు ముగించి, వ్యాయామం, యోగ, ధ్యానం, సైక్లింగ్, రన్నింగ్ వంటివి చేయండి.
2. బ్రేక్ ఫాస్ట్ /టిఫిన్ తినటానికి 30 నిమిషాలకు ముందు “ఉదయం జూస్” జ్యూస్ త్రాగండి.సాయంత్రం 4:30 pm కు రసాల పట్టిక నుంచి డాక్టరు గారు సూచించిన జ్యూస్ త్రాగండి.
3. రాత్రి భోజనం పండ్లు మాత్రమే తినండి. 6-7pm లోపు ముగించండి.
4. మాంసాహారం, గుడ్లు , పాలు వద్దు, జన్యుమార్పిడి GMO ఆహారం వద్దు.
5. ఆహారంలో ఉప్పు, కారం, నూనె తగ్గించండి.
6. భోజనానికి భోజనానికి మధ్య ప్రతి గంటకి ఒక గ్లాసు మంచినీళ్ళు త్రాగండి. అలాగే అప్పుడప్పుడు మధ్యలో మజ్జిగ కూడా త్రాగండి.
7. ప్రతిరోజు శరీరానికి శ్రమ కలిగించే పనులు చేయండి (కనీసం వ్యాయామం లేదా యోగా). ఇది మీ శరీర కణాల జీవన క్రమంలో కీలకమైన అంశం.
గమనిక:
1.ఒక గ్లాస్ జ్యూస్ కి అన్నీ రకాల ఆకులు కలిపి గుప్పెడు పరిమాణంలో సరిపోతాయి.
2.అన్ని రకాల జ్యూస్ లు తగినన్ని నీళ్లు కలిపి పల్చగా చేసుకుని త్రాగవచ్చు. జ్యూస్ లు వడకట్టుకొని త్రాగాలి.
3.అన్నీ జ్యూస్ లకు నిమ్మరసం, తేనె కలుపుకొని త్రాగవచ్చు. డయాబెటిక్ వాళ్ళు జ్యూస్ లో తేనె వాడరాదు.
4.సైనస్, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్న వారు, గోరువెచ్చని నీటితో జ్యూస్ ని పల్చగా చేసుకుని త్రాగాలి.
ఉదయం జ్యూస్: బ్రేక్ ఫాస్ట్ (టిఫిన్) తినటానికి 30 నిమిషాలకు ముందు క్రింది జ్యూస్ త్రాగాలి. ప్రతిరోజు ఇదే జ్యూస్. డాక్టర్ గారు ఈ జ్యూసుకి అదనంగా మీ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏదైనా కలుపుకుని జూస్ చేసుకోమంటే అలాగే చేయండి.
కొత్తిమీర + పుదీనా + 7 తులసి ఆకులు (మొత్తం కలిపి గుప్పెడు)
సాయంత్రం జ్యూస్: (4:30 గంటలకు)
1.మునగాకు + కరివేపాకు జ్యూస్.
2.బూడిద గుమ్మడికాయ జ్యూస్.
3.మిక్సిడ్ కూరగాయల జ్యూస్ (టమాటా + కీరా + సొరకాయ + బీరకాయ).
4.క్యారెట్ + బీట్ రూట్ జ్యూస్ (డయాబెటిక్ వాళ్ళు త్రాగకూడదు).
5.4-గంటలు నానబెట్టి వడకట్టిన తవుడు జ్యూస్ (బీ-కాంప్లెక్స్ కొరకు).
6.తోటకూర + కరివేపాకు (ఎముకల పుష్టికి, క్యాల్షియం కొరకు).
7.పాలకూర + కరివేపాకు జ్యూస్ (బీపీ తక్కువ ఉన్న వారికి).
8.గుప్పెడు గోంగూర ఆకును గ్లాసు నీటిలో ఉడికించి, వడకట్టిన కషాయం (రక్తం పెరుగుట కొరకు).
9.8-రోజులు వయస్సు గల గోధుమగడ్డి జ్యూస్ (రక్తం పెరగడానికి).
10.కొండపిండి ఆకుల జ్యూస్ (కిడ్నీలో రాళ్లు కరగడానికి).
11.రణపాల ఆకుల జ్యూస్ (గాల్ బ్లాడర్ లో రాళ్ళు కరగటానికి).
12.తెల్ల గలిజేరు జ్యూస్ (క్రియాటినిన్ ఎక్కువ ఉంటే తగ్గటానికి).
ఉదయం (7-8 am):బ్రేక్ ఫాస్ట్ /టిఫిన్:
సహజమైన ఆహారం మంచిది: పండ్లు, మొలకలు, సలాడ్స్, పచ్చికొబ్బరి, ఖర్జూరం. నానపెట్టిన గింజలు: పల్లీలు, గుమ్మడి, పొద్దుతిరుగుడు, బాదం, వాల్నట్స్ లాంటివి.
(లేదా సహజమైన ఆహారం అలవాటు చేసుకొనే వరకు)
వండిన ఆహారం:
1.పొట్టు మినప్పప్పు + చిరుధాన్యాలు లేదా ముడి బియ్యంతో చేసిన ఇడ్లీ లేదా దోశలు.
2.ఇడ్లీ పిండికి పాలకూర + క్యారెట్ తురుము కలుపుకోవచ్చు.
3.దోశ పిండికి ఆకుకూరలు + తవుడు కలుపుకోవచ్చు.
4.పెసల మొలకలతో దోశలు చేసుకోవచ్చు.
5.జొన్న / సజ్జ / రాగి రొట్టెలు.
6.చిరుధాన్యాలతో చేసిన అంబలి.
7.కూరగాయలతో చేసిన ఉప్మా.
మధ్యాహ్నం (12-1 pm):
అన్నం (లేదా) రొట్టెలు:
1.ముడి బియ్యము /రెడ్ రైస్ /బ్లాక్ రైస్ /చిరుధాన్యాలతో చేసిన అన్నం.(భోజనంలో 50% అన్నం + 50% కూర ఉండాలి)
2.లేదా చిరుధాన్యాలతో చేసిన రొట్టెలు / పుల్కాలు.(2 రొట్టెలు + 50% కూర ఉండాలి)
కూర:
1.ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
2.కూరల్లో నూనె, ఉప్పు, కారం ఇప్పుడు వాడుతున్న దానిలో 50% తగ్గించాలి. ఉప్పు, కారం లేని లోటు తెలియకుండా ఉల్లిపాయ మరియు నిమ్మకాయ రసం వాడుకోవచ్చు.
3.కూరలు ఉడికించి దించేముందు రుచి కొరకు, వేయించి తయారుచేసిన పల్లీలు / నువ్వులు / మినప్పప్పు / శనగపప్పు పొడులు, ఎండు లేదా పచ్చి కొబ్బరి తురుము కలుపుకోవచ్చు.
సాయంత్రం (6-7 pm):
1.పూర్తిగా పండ్లు మాత్రమే తీసుకోవాలి. అరటి పండు తప్పించి అన్ని రకాల పండ్లు తినవచ్చు.
డయాబెటిక్ (మదుమేహ వ్యాధి) ఉన్నవారు, అరటి, మామిడి, సపోటా, సీతాఫలం, మరియు ఖర్జూరం తినకూడదు.