Dr. Padma & Dr. Ramachandra

Dr. Padma & Dr. Ramachandra

Naturopathy, 24 years of Dedication

Home

NATURE

Endless Potential

We are health and nutrition experts

We are here to help you become the healthiest version of yourself

Health Advices

More than 3 lakhs patients consulted personally at Prakruti Ashram. The consultation and food is served for FREE since the inception of this Ashram. 

Online Trainings

With deep desire to make the world disease free, we started offering online trainings on fundamentals of health.

Gallery

Restless health movement activities since 24 years. Have a look at few photos that we are able to gather from friends and well-wishers. 

About

నిజానికి తెలుగు జాతికి పరిచయం అవసరం లేని వ్యక్తులు డా.రామచంద్ర, డా.పద్మ గార్లు. వీరు ప్రస్తుత సమాజంలో అసాధ్యం అనిపించే అనారోగ్య సమస్యలు సైతం ఇంట్లోనే ఎలా తేలికగా తగ్గించుకోవచ్చో అందరికీ అర్థం అయ్యేలా చెప్పి, ఎన్నో లక్షల మందిని ప్రత్యక్షంగా, యూట్యూబ్, టివీల ద్వారా ప్రభావితం చేసారు.

ఈ రోజు మన కుటుంబాలలో ఎవరికయినా అనారోగ్య సమస్యలు వస్తే, కుటుంబమంతా ఆందోళన చెందే పరిస్థితిలో ఉన్నాము. కారణం ఏమిటంటే…ఏ జలుబో, దగ్గో, జ్వరమో, విరోచనాలో, సాధారణంగా వస్తే మందులు వేసుకుంటే తగ్గుతున్నాయేమో. కాని బీ.పీ, షుగరు, మోకాళ్ళ నొప్పులు, థైరాయిడ్, సొరియాసిస్, కిడ్నీ, లివరు, గ్యాస్, అధిక బరువు, పక్షవాతం వంటి సమస్యలు వస్తే తగ్గే పరిస్థితి లేదు కదా. అలాగే ఆడ వారికి కీళ్లనొప్పులు, PCOD, బహిష్టు సమస్యలు, గర్భసంచి సమస్యలు లాంటివి ఎంత వేదిస్తున్నాయో మనకు తెలుసు. ఇంకా క్యాన్సర్ లాంటి మహమ్మారి జబ్బులు ఏవీ తగ్గే పరిస్థితి కనబడటం లేదు. కొన్నింటికి ఉపశమనం కోసం జీవితాంతం మందులు వాడాల్సిందేనని అంటున్నారు. కొన్నింటికి ఆపరేషన్ చేసి తీసేయడమే మార్గం అంటున్నారు. కొన్నింటికి ట్రాన్స్ ప్లాంటేషన్ తప్ప మరో మార్గం లేదంటున్నారు. ఇంకా ఏ పరిష్కారం లేని జబ్బులకి దేవుడి మీద భారం వేయమంటున్నారు.

ఆస్తులు అమ్ముకుంటున్నా, అప్పుల పాలవుతున్నా కూడా జబ్బులు తగ్గే మార్గం కనబడడం లేదు. డాక్టర్లను మార్చినా, మందులు మార్చినా, ఉపయోగం కనబడటం లేదు. ఈరోజు అనేకమంది అన్నం తింటున్నట్లు మందులు వాడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి పరిస్థితులలో ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులయినా, జీవితాంతం తగ్గదనుకుంటున్నా, ఆపరేషన్ తప్పిస్తే మరో మార్గం లేదనుకుంటున్నా, ఏ జబ్బులైనా ఇంటి వద్దనే ఉంటూ, ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా తేలికగా, పూర్తిగా నయం చేసుకోగలిగే అద్భుతమైన ప్రకృతి వైద్య విధానం డాక్టర్ రామచంద్ర, డాక్టర్ పద్మ దంపతులు మనకి అందిస్తున్నారు.

డాక్టర్ రామచంద్ర గారు ఖమ్మం జిల్లా, నేలకొండపల్లిలో ప్రకృతి చికిత్సాలయాన్ని ఏర్పాటు చేసుకొని గత 24 సంవత్సరాలుగా ఉచితంగా వైద్యం అందిస్తూ, ఎన్నో లక్షలాది కుటుంబాలలో వెలుగుల్ని నింపారు. జీవితాంతం తగ్గదనుకుంటున్న మొండి వ్యాధులను సైతం మన ఆహార జీవనశైలిలో కొద్దిపాటి మార్పుల ద్వారానే పరిష్కరించుకోవచ్చని నిరూపించారు. యూట్యూబ్, స్టార్ మాటీవీలో, ఆన్లైన్ క్లాసుల ద్వారా ఎన్నో ప్రసంగాలు చేసి, దాదాపు అన్ని జబ్బులకు అవగాహన కల్పిస్తున్నారు. వీరి మహోన్నతమైన సేవలకు గుర్తింపుగా, మన దేశంలోని ప్రతిష్ఠాత్మక “డా.ఏ.పీ.జే. అబ్దుల్ కలాం నేషనల్ అవార్డ్” మరియు గౌరవ పురస్కారమైన “ఏ లివింగ్ చరక” బిరుదు అందుకున్నారు.

ఉభయ తెలుగు రాష్టాలలో అనేక యోగా కేంద్రాలు స్థాపించి వందలమందికి యోగా కోర్సులు నిర్వహించారు. అలాగే ఆరోగ్య మహాసభలు, ఫ్రూట్ ఫెస్టివల్స్, జ్యూస్ ఫెస్టివల్స్, మిల్లెట్ ఫెస్టివల్స్ వంటి మహా కార్యక్రమాలు, ‘సిద్ధార్థ యోగా ఒలంపియాడ్స్’ పేరు మీద ఉభయ తెలుగు రాష్టాలలో యోగా పోటీలు, దాదాపు వెయ్యికి పైగా ఆరోగ్య అవగాహనా సదస్సులు, విద్యార్ధుల కోసం హైస్కూల్ నుంచి కాలేజ్ వరకు ఎన్నో సెమినార్స్, రైతుల కోసం వ్యవసాయ మహాసభలు, యూట్యూబ్ వీడియోలు, అనేక ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు. వీటన్నిటితో పాటుగా వారానికి మూడు రోజులు నేలకొండపల్లి ఆశ్రమంలో ఉచితంగా ఆరోగ్య సలహాలిస్తూ, వచ్చిన వారందరికీ ఆశ్రమంలో ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు.

ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా మారాలని నిర్విరామంగా చేస్తున్న కృషి, తపనలో భాగంగా ఆరోగ్య జ్ఞానాన్ని అందరికీ చేరువలోకి తెచ్చే ప్రయత్నమే ఈ వెబ్సైట్.

Let's Work Together

For a disease free world

Address:
Siddhardha Yoga Vidyalayam,
Siddhardha Nagar,
Opp Bouddha Stupam,
Nelakondapalli, Khammam Dt,
Telangana. 507160

Phone:
+91 99666 66627

Email:
info@drramachandra.com

Advices:
For any health related queries, we have a volunteer team in Telegram group who may guide you appropriately. Please join our Telegram group.

ఆశ్రమంలో వైద్య సలహాలు / Ashram Consultation Days:

నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమం వైద్య సలహాల కొరకు కేవలం బుధ, గురు, శుక్ర వారాలలో మాత్రమే తెరిచి ఉంటుంది. ఏమైనా మార్పులు ఉంటే ఈ ప్రక్క/ క్రింద క్యాలెండర్ లో ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇవ్వబడుతుంది.

ఆశ్రమంలో ఇన్ పేషంట్ సదుపాయం లేదు.
హైదరాబాద్లో కన్సల్టేషన్ లేదు.
టెలిఫోన్ ద్వారా అపాయింట్మెంట్స్ ఇవ్వబడవు.

ఆశ్రమానికి నేరుగా ఉదయం 8 గంటల లోపు వచ్చిన వారికి మాత్రమే టోకెన్లు ఇవ్వబడతాయి. వారిని మాత్రమే డాక్టర్ గారు చూస్తారు.

ఆశ్రమంలో మందుల షాపు కన్సల్టేషన్ ఉన్న రోజులతో సంబంధం లేకుండా ప్రతీ బుధ, గురు, శుక్ర వారాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది.

ఆశ్రమం రావడానికి మార్గాలు:
1. ఇతర ఊళ్ళ నుంచి నేలకొండపల్లి రావడానికి
2. నేలకొండపల్లి నుంచి ఆశ్రమానికి
3. గూగుల్ డైరెక్షన్స్

ఆరోగ్య సలహాలు ఉచితం.
భోజన సదుపాయం ఉచితం.

At Nelakondapalli Prakruthi Ashram, Consultations are only on Wed, Thu & Friday of every week. Any changes in the schedule will be updated regularly in beside/below calendar.

No In-Patient facilities at Ashram.
No Hyderabad consultations now.
No Telephone or Online bookings at this time.

Only Walk-ins. Those who reach before 8 am only will be given tokens for consultation. No exceptions.

Pharmacy: Will be open on Wed, Thu & Friday of every week from morning 9am to evening 5pm, irrespective of consultation available days. 

Directions:
1. Other cities to Nelakondapalli
2. Nelakondapalli to Ashram
3. Google Directions

No fees for Consultation.
Food served for free.

“Home is Hospital - Kitchen is Pharmacy - Mother is Doctor”