Dr. Padma & Dr. Ramachandra

We are pleased to announce the availability of telephone appointments for consultations at Nelakonapally Ashram. This initiative aims to enhance your convenience while enabling us to provide better service and manage visitor flow effectively.
For Telephone Appointments
Call

Master Your Body

ప్రకృతే వైద్యుడు - Naturopathy online classes

New batch commencing from 15-SEP-2025 (Monday)

Health Advices

More than 3 lakhs patients consulted personally at Prakruti Ashram. The consultation and food is served for FREE since the inception of this Ashram. 

Online Trainings

With deep desire to make the world disease free, we started offering online trainings on fundamentals of health.

Gallery

Restless health movement activities since 24 years. Have a look at few photos that we are able to gather from friends and well-wishers. 

About

నిజానికి తెలుగు జాతికి పరిచయం అవసరం లేని వ్యక్తులు డా.రామచంద్ర, డా.పద్మ గార్లు. వీరు ప్రస్తుత సమాజంలో అసాధ్యం అనిపించే అనారోగ్య సమస్యలు సైతం ఇంట్లోనే ఎలా తేలికగా తగ్గించుకోవచ్చో అందరికీ అర్థం అయ్యేలా చెప్పి, ఎన్నో లక్షల మందిని ప్రత్యక్షంగా, యూట్యూబ్, టివీల ద్వారా ప్రభావితం చేసారు.

ఈ రోజు మన కుటుంబాలలో ఎవరికయినా అనారోగ్య సమస్యలు వస్తే, కుటుంబమంతా ఆందోళన చెందే పరిస్థితిలో ఉన్నాము. కారణం ఏమిటంటే…ఏ జలుబో, దగ్గో, జ్వరమో, విరోచనాలో, సాధారణంగా వస్తే మందులు వేసుకుంటే తగ్గుతున్నాయేమో. కాని బీ.పీ, షుగరు, మోకాళ్ళ నొప్పులు, థైరాయిడ్, సొరియాసిస్, కిడ్నీ, లివరు, గ్యాస్, అధిక బరువు, పక్షవాతం వంటి సమస్యలు వస్తే తగ్గే పరిస్థితి లేదు కదా. అలాగే ఆడ వారికి కీళ్లనొప్పులు, PCOD, బహిష్టు సమస్యలు, గర్భసంచి సమస్యలు లాంటివి ఎంత వేదిస్తున్నాయో మనకు తెలుసు. ఇంకా క్యాన్సర్ లాంటి మహమ్మారి జబ్బులు ఏవీ తగ్గే పరిస్థితి కనబడటం లేదు. కొన్నింటికి ఉపశమనం కోసం జీవితాంతం మందులు వాడాల్సిందేనని అంటున్నారు. కొన్నింటికి ఆపరేషన్ చేసి తీసేయడమే మార్గం అంటున్నారు. కొన్నింటికి ట్రాన్స్ ప్లాంటేషన్ తప్ప మరో మార్గం లేదంటున్నారు. ఇంకా ఏ పరిష్కారం లేని జబ్బులకి దేవుడి మీద భారం వేయమంటున్నారు.

ఆస్తులు అమ్ముకుంటున్నా, అప్పుల పాలవుతున్నా కూడా జబ్బులు తగ్గే మార్గం కనబడడం లేదు. డాక్టర్లను మార్చినా, మందులు మార్చినా, ఉపయోగం కనబడటం లేదు. ఈరోజు అనేకమంది అన్నం తింటున్నట్లు మందులు వాడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి పరిస్థితులలో ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులయినా, జీవితాంతం తగ్గదనుకుంటున్నా, ఆపరేషన్ తప్పిస్తే మరో మార్గం లేదనుకుంటున్నా, ఏ జబ్బులైనా ఇంటి వద్దనే ఉంటూ, ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా తేలికగా, పూర్తిగా నయం చేసుకోగలిగే అద్భుతమైన ప్రకృతి వైద్య విధానం డాక్టర్ రామచంద్ర, డాక్టర్ పద్మ దంపతులు మనకి అందిస్తున్నారు.

డాక్టర్ రామచంద్ర గారు ఖమ్మం జిల్లా, నేలకొండపల్లిలో ప్రకృతి చికిత్సాలయాన్ని ఏర్పాటు చేసుకొని గత 24 సంవత్సరాలుగా ఉచితంగా వైద్యం అందిస్తూ, ఎన్నో లక్షలాది కుటుంబాలలో వెలుగుల్ని నింపారు. జీవితాంతం తగ్గదనుకుంటున్న మొండి వ్యాధులను సైతం మన ఆహార జీవనశైలిలో కొద్దిపాటి మార్పుల ద్వారానే పరిష్కరించుకోవచ్చని నిరూపించారు. యూట్యూబ్, స్టార్ మాటీవీలో, ఆన్లైన్ క్లాసుల ద్వారా ఎన్నో ప్రసంగాలు చేసి, దాదాపు అన్ని జబ్బులకు అవగాహన కల్పిస్తున్నారు. వీరి మహోన్నతమైన సేవలకు గుర్తింపుగా, మన దేశంలోని ప్రతిష్ఠాత్మక “డా.ఏ.పీ.జే. అబ్దుల్ కలాం నేషనల్ అవార్డ్” మరియు గౌరవ పురస్కారమైన “ఏ లివింగ్ చరక” బిరుదు అందుకున్నారు.

ఉభయ తెలుగు రాష్టాలలో అనేక యోగా కేంద్రాలు స్థాపించి వందలమందికి యోగా కోర్సులు నిర్వహించారు. అలాగే ఆరోగ్య మహాసభలు, ఫ్రూట్ ఫెస్టివల్స్, జ్యూస్ ఫెస్టివల్స్, మిల్లెట్ ఫెస్టివల్స్ వంటి మహా కార్యక్రమాలు, ‘సిద్ధార్థ యోగా ఒలంపియాడ్స్’ పేరు మీద ఉభయ తెలుగు రాష్టాలలో యోగా పోటీలు, దాదాపు వెయ్యికి పైగా ఆరోగ్య అవగాహనా సదస్సులు, విద్యార్ధుల కోసం హైస్కూల్ నుంచి కాలేజ్ వరకు ఎన్నో సెమినార్స్, రైతుల కోసం వ్యవసాయ మహాసభలు, యూట్యూబ్ వీడియోలు, అనేక ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు. వీటన్నిటితో పాటుగా వారానికి మూడు రోజులు నేలకొండపల్లి ఆశ్రమంలో ఉచితంగా ఆరోగ్య సలహాలిస్తూ, వచ్చిన వారందరికీ ఆశ్రమంలో ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు.

ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా మారాలని నిర్విరామంగా చేస్తున్న కృషి, తపనలో భాగంగా ఆరోగ్య జ్ఞానాన్ని అందరికీ చేరువలోకి తెచ్చే ప్రయత్నమే ఈ వెబ్సైట్.

ఆశ్రమంలో వైద్య సలహాలు / Ashram Consultation Days:

నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమం సాదారణంగా బుధ, గురు, శుక్ర వారాలలో మాత్రమే తెరిచి ఉంటుంది. ఏమైనా మార్పులు ఉంటే ఈ పైన/ప్రక్కన క్యాలెండర్ లో ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇవ్వబడుతుంది.

టెలిఫోన్ ద్వారా అపాయింట్మెంట్స్ కొరకు ఈ క్రింది నంబర్లకు కాల్ చేయగలరు (కాల్స్ ఉదయం 9AM నుంచి సాయంత్రం 5PM వరకు మాత్రమే చేయగలరు).

📞 99 666 666 27
📞 8328 777 888

ఆశ్రమంలో సప్లిమెంట్ షాపు, ఆదివారం తప్పించి ప్రతీ రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే సప్లిమెంట్స్ కొరియర్ సదుపాయం కొరకు 95424 00099 ను సంప్రదించగలరు.

ఆశ్రమం రావడానికి మార్గాలు:
1. ఇతర ఊళ్ళ నుంచి నేలకొండపల్లి రావడానికి
2. నేలకొండపల్లి నుంచి ఆశ్రమానికి
3. గూగుల్ డైరెక్షన్స్

-ఆరోగ్య సలహాలు ఉచితం.
-భోజన సదుపాయం ఉచితం.
-ఆశ్రమంలో ఇన్ పేషంట్ సదుపాయం లేదు.
-హైదరాబాద్లో కన్సల్టేషన్ లేదు.

Nelakondapalli Prakruthi Ashram is open for Consultations usually on Wed, Thu & Friday only of every week. Any changes in the schedule will be updated regularly in above/beside calendar.

For Telephone appointments, please call below numbers (Call between 9AM to 5PM only).

📞 99 666 666 27
📞 8328 777 888

Supplement Shop: Will be open on everyday except Sunday from morning 9am to evening 4pm. Also, contact 95424 00099 for supplements courier facility.

Directions:
1. Other cities to Nelakondapalli
2. Nelakondapalli to Ashram
3. Google Directions

-No fees for Consultation.
-Food served for free.
-No In-Patient facilities at Ashram.
-No Hyderabad consultations now.

Address:
Siddhardha Yoga Vidyalayam,
Siddhardha Nagar,
Opp Bouddha Stupam,
Nelakondapalli, Khammam Dt,
Telangana. 507160

Ashram Phone:
(Call between 9am to 5pm only)
+91 99666 66627
+91 8325 777 888

Supplement Shop:
(Call between 9am to 4pm only. Shop is closed on Sunday)
+91 95424 00099

“ఇల్లే వైద్యశాల - వంటగదే మందుల షాపు - అమ్మే డాక్టరు”

Let's Work Together

For a disease free world

Master Your Body

ప్రకృతే వైద్యుడు - Naturopathy online classes

New batch commencing from 15-SEP-2025 (Monday)

Scroll to Top